భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం
నోబెల్ బహుమతి(Nobel Prize)కి ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి. భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యం
దిశ, వెబ్‌డెస్క్: నోబెల్ బహుమతి(Nobel Prize)కి ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి. భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా ఈ అత్యున్నత బహుమతిని ప్రకటిస్తారు. తాజాగా.. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం ప్రకటించారు. జాన్ జే హోప్‌ఫీల్డ్(John J Hopfield), జెఫ్‌రీ హింటన్(Jeffrey Hinton)కు నోబెల్ బహుమతి లభించింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు గానూ ఈ అత్యున్నత పురస్కారం వరించింది.
స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. గతేడాది (2023) భౌతికశాస్త్రంలో ఈ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. నేడు భౌతికశాస్త్రంలో, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే.