31 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన మహిళకు నోబెల్ శాంతి బహుమతి

ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదీకి 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది.

Update: 2023-10-06 12:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదీకి 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. నార్వేకు చెందిన నోబెల్ కమిటీ ఇవాళ ప్రకటించింది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాటం సాగిస్తున్నందున నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త అయిన నర్గీస్ మహమ్మదీ మహిళా హక్కుల కోసం, మరణ శిక్షకు వ్యతిరేకంగా కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఏవీన్ కారాగారంలో వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడినందుకు నర్గీస్ 13 సార్లు అరెస్టయ్యారు. ఆమెకు 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించబడ్డాయి.



Tags:    

Similar News