గెలాక్సీలో 4 గ్రహాంతర నాగరికతలు.. భూమికి హాని ఉందా.. కొత్త స్టడీ అవునంటోంది!
దీని ద్వారా "వావ్! సిగ్నల్"ని గుర్తించినట్లు పేర్కొన్నాడు. 4 hostile alien civilizations may lurk in the Milky Way.
దిశ, వెబ్‌డెస్క్ః గత కొన్ని దశాబ్దాలుగా అంతరిక్షంలో అనేక ఆవిష్కరణలు వెలుగు చూశాయి. బ్లాక్ హోల్ నుండి మన సౌర వ్యవస్థ బయట ఉన్న మొదటి గ్రహం కనుక్కోవడం వరకూ చాలా కొత్త విశేషాలు కనుగొన్నాము. అయితే, ఇటీవల ఆందోళన కలిగించే ఒక విషయాన్ని పరిశోధకులు బయటపెట్టారు. ఈ అధ్యయనం ప్రకారం, మన పాలపుంతలో భూ గ్రహంపై దాడి చేసే నాలుగు గ్రహాంతర నాగరికతలు ఉండవచ్చని తెలిపారు. స్పెయిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ విగోలో పీహెచ్‌డీ విద్యార్థి అయిన అల్బెర్టో కాబల్లెరో ఈ నెల ప్రారంభంలో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీలో ఒక పరిశోధనను ప్రచురించారు. దీని ద్వారా "వావ్! సిగ్నల్"ని గుర్తించినట్లు పేర్కొన్నాడు.
కాబల్లెరో ప్రకారం, బేసి నిమిషం-నిడివిలో రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ శక్తి సంభవించిందని, ఇది భూమి నుండి 1,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుడి లాంటి నక్షత్రం నుండి వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది గతంలో ఓహియో స్టేట్ యూనివర్శిటీలోని బిగ్ ఇయర్ టెలిస్కోప్ ద్వారా స్వీకరించారు. 60 ఏళ్లుగా మానవులు శోధించడం ప్రారంభించినప్పటి నుండి ఇతర గ్రహాలపై జీవితం ఉందని చెప్పడానికి గొప్ప సిగ్నల్ అని పిలుస్తున్నారు. ఇక, కాబల్లెరో పరిశోధన, "హానికరమైన భూలోకేతర నాగరికతల ప్రాబల్యాన్ని అంచనా వేయడం" అనే అంశంపై కొనసాగింది. పరిశోధకుడి ప్రకారం, మనం చేస్తున్న కొన్ని ప్రయోగాలు గ్రహాంతరవాసుల దాడిని ప్రేరేపిస్తాయనే భయంతో అతను "మెసేజింగ్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ (METI)"ని ఉపయోగించవద్దని శాస్త్రవేత్తలను హెచ్చరించాడు.
అయితే, ఇటువంటి పరిస్థితి 100 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని, కాబట్టి భూమి ప్రస్తుతానికి సురక్షితంగా ఉందని స్టడీలో పేర్కొన్నారు. "గ్రహాంతరవాసులు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. గ్రహాంతర నాగరికతలో వేరే రసాయన కూర్పుతో కూడిన మెదడు ఉండొచ్చు" అని పరిశోధకలు అంటున్నారు. ఇక, ఖచ్చితమైన సాక్ష్యం లేనప్పటికీ, అమెరికా ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఇతర గ్రహాలపై పెరుగుతున్న జీవ సంకేతాలను తీవ్రంగా పరిగణించింది. గతేడాది, అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు రూపొందించిన, ప్రాథమిక అంచనా ప్రకారం, తెలియని వేగంతో ఎగురుతున్న గ్రహాంతర విమానం, సాసర్ వంటి ఇతర పరికరాలకు సంబంధించి 144 పరిశీలనలను జాబితా చేశారు. దీనిపై, మరింత పరిశోధనలు కొనసాగుతున్నాయి.