Netanyahu: హిజ్బుల్లా నుంచి విముక్తి పొందండి.. లెబనాన్ ప్రజలకు నెతన్యాహు సూచన

ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లెబనాన్‌కు కీలక విజ్ఞప్తి చేశారు.

Update: 2024-10-08 17:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లెబనాన్‌కు కీలక విజ్ఞప్తి చేశారు. హిజ్బుల్లా నుంచి లెబనాన్ ప్రజలు విముక్తి పొందాలని కోరారు. మార్పు కోసం అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన ఓ వీడియో సందేశంలో మాట్లాడారు. హిజ్బుల్లా సంస్థకు చెందిన కీలక నాయకులకు మట్టుబెట్టామని తెలిపారు. నస్రల్లా, అతని వారసుడు సహా వేలాది మంది ఉగ్రవాదులను హతమార్చామన్నారు. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. దీంతో హిజ్బు్ల్లా ప్రస్తుతం బలహీనంగా మారిందన్నారు. లెబనాన్ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతూ హిజ్బుల్లా నుంచి ప్రజలు విముక్తి పొందాలని, లేదంటే హిజ్బుల్లా లెబనీస్ ప్రజల ఖర్చుతో జనసాంద్రత ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌తో పోరాడటానికి ప్రయత్నిస్తూనే ఉంటుందని తెలిపారు. పౌర ప్రాంతాల్లో సంఘర్షణ పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.


Similar News