విశ్వాస పరీక్షలో ‘ప్రచండ’ విజయం
దిశ, నేషనల్ బ్యూరో : నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ (69) బుధవారం పార్లమెంటులో విశ్వాస తీర్మానాన్ని గెలుచుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ (69) బుధవారం పార్లమెంటులో విశ్వాస తీర్మానాన్ని గెలుచుకున్నారు. మొత్తం 275 మంది సభ్యులను కలిగిన నేపాల్ ప్రతినిధుల సభలో ఆయనకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) 157 ఓట్లను సాధించింది. తన ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపాలీ కాంగ్రెస్‌కు ఇటీవల పుష్పకమల్ దహల్ గుడ్ బై చెప్పారు. తాజాగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో ఆయన చేతులు కలిపారు.ఈనేపథ్యంలో పార్లమెంటులో నిర్వహించిన విశ్వాస పరీక్షలో పుష్పకమల్ దహల్ నెగ్గారు. ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ‘138’ కంటే ఎక్కువ మంది సభ్యుల బలాన్ని కూడగట్టడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ప్రచండ 2022 డిసెంబరులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈవిధంగా విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ఇది మూడోసారి.