Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకొచ్చే మిషన్ షురూ

దిశ, నేషనల్ బ్యూరో : బోయింగ్ కంపెనీకి చెందిన ‘స్టార్ లైనర్‌‌’ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఏడాది జూన్‌ 5న అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు ఇంకా అక్కడే ఉన్నారు.

Update: 2024-09-28 18:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బోయింగ్ కంపెనీకి చెందిన ‘స్టార్ లైనర్‌‌’ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఏడాది జూన్‌ 5న అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు ఇంకా అక్కడే ఉన్నారు. ఎట్టకేలకు దాదాపు 140 రోజుల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వారిని భూమికి తిరిగి తీసుకొచ్చే కసరత్తు మొదలైంది. ఇందుకోసం శనివారం రోజు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కేప్ కెనవెరల్ నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీ స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరి వెళ్లింది. ఇందులో నాసా వ్యోమగామి నిక్ హాగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు.

స్పేస్ క్రాఫ్ట్‌లో అదనంగా రెండుసీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లకు కేటాయించారు. ఐఎస్ఎస్‌లో ఉన్న వ్యోమగాములకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి షిఫ్టులు మారుతుంటాయి. అంటే ఏడాదిలో రెండుసార్లు స్పేస్‌క్రాఫ్ట్‌లో నాసా కొత్త వ్యోమగాములను ఐఎస్ఎస్‌లో డ్యూటీకి పంపించి, డ్యూటీ పూర్తయిన వారిని అక్కడి నుంచి వెనక్కి తీసుకొస్తుంటుంది. ఇప్పుడు పంపిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో భూమికి తిరిగి రానుంది. అప్పుడే సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భూమికి తిరిగొస్తారు. అప్పటికల్లా ఐఎస్ఎస్‌లో వారిద్దరు 8 నెలల వసతి కాలాన్ని పూర్తి చేసుకుంటారు.


Similar News