అంతరిక్ష నౌకల కోసం కొత్త సైన్యం.. 'స్టార్ వార్స్' మొదలైనట్టేనా..?!
వాటిని శోధించాల్సిన ప్రయత్నం మాత్రమే మనం చేయగలం. NASA dedicates a full-fledged team to find about UFOs.
దిశ, వెబ్‌డెస్క్ః మానవుడు అజ్ఞానాన్ని జయించి, ఆధునిక విజ్ఞానం సాధించడానికి ఎన్నో తరాలు పట్టింది. మనిషి ప్రపంచ మానవుడిగా అవతారం ఎత్తిన తర్వాత ఈ విజ్ఞానం మరింత వేళ్లీనుకుంది. భూమిని దాటి విశ్వాంతరాళానికి ప్రయాణంలో ఏలియన్లు, యూఎఫ్ఓల వెతుకులాట ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, తాజాగా నాసా సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. చాలా ప్రమాదకరమైన, అధిక-ప్రభావవంతమైన శాస్త్రం వైపు NASA UFOల అధ్యయనాన్ని ప్రారంభించింది. ఈ విషయంపై బహిరంగంగా ఎంత సమాచారం అందుబాటులో ఉందో తెలుసుకోడానికి, వివరించలేని కొన్ని సంఘటనలను, వీక్షణలను అర్థం చేసుకోవడానికి, అలాగే వీటి వేటలో ఇంకా ఎంత పనితనం అవసరమో శోధించి, ఛేధించడానికి ఒక స్వతంత్ర బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అంతరిక్ష సంస్థ గురువారం ప్రకటన చేసింది. ఈ బృందం సేకరించిన సమాచారం మొత్తాన్ని భవిష్యత్తులో ఎలా ఉత్తమంగా ఉపయోగించాలో కూడా నిపుణులు పరిశీలించనున్నట్లు తెలియజేశారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెబ్‌కాస్ట్ సందర్భంగా నాసా సైన్స్ మిషన్ చీఫ్, థామస్ జుర్బుచెన్ మాట్లాడుతూ, "ప్రతిష్టాత్మకమైన రిస్క్ నుండి మేము దూరంగా ఉండలేము. ఈ దృగ్విషయాలలో అతిపెద్ద సవాలును ఎదుర్కోడానికి మా బలమైన నమ్మకం పనిచేస్తుందని అనుకుంటున్నాము" అని అన్నారు. UAPలు, అన్ ఐడెంటిఫైడ్ వైమానిక దృగ్విషయాలగా పిలిచే వాహనాలు, ఆకాశంలో మర్మమైన వీక్షణలను వివరించే ప్రయత్నంలో ఇది మొదటి దశగా NASA పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. శాస్త్రీయ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు సైమన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డేవిడ్ స్పెర్గెల్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారని నాసా తెలిపింది. ఒక వార్తా సమావేశంలో, స్పెర్గెల్ మాట్లాడుతూ, "నేను నా కెరీర్‌లో ఎక్కువ భాగం కాస్మోలాజిస్ట్‌గా గడిపాను. విశ్వంలో 95% ఏం జరుగుతుందో మాకు తెలియదని నేను కచ్ఛితంగా చెప్పగలను. కాబట్టి మనకు అర్థం కాని విషయాలు ఉన్నాయి. వాటిని శోధించాల్సిన ప్రయత్నం మాత్రమే మనం చేయగలం" అన్నారు.
LIVE NOW: We're commissioning a team to study unidentified aerial phenomena—observations of events in the sky that cannot be identified as aircraft or known natural phenomena. https://t.co/3fXbnL1BWs pic.twitter.com/1txTVQonpL
— NASA (@NASA) June 9, 2022