ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్మశానవాటిక ఏది.. అలా ఎందుకు పిలుస్తారు.. ?

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ శిఖరం ఎవరెస్ట్ పర్వతం.

Update: 2024-03-03 05:20 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ శిఖరం ఎవరెస్ట్ పర్వతం. ప్రపంచంలో ఎత్తైన పర్వతం గురించి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఆలోచించకుండా అందరూ ఎవరెస్ట్ పేరు చెబుతారు. ఎవరెస్ట్ పర్వతం నేపాల్‌లో ఉంది. దాని ఎత్తు గురించి చెప్పాలంటే ఇది 8848 మీటర్లు. అయితే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్మశానవాటికగా కూడా చెబుతారు. అసలు ఎందుకు అలా అంటారో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 800 మంది అధిరోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారు. అయితే ఎక్కే వాళ్లందరిలో అందరూ సజీవంగా తిరిగి రారు. అందుకే దీన్ని ఎత్తైన స్మశాన వాటిక అంటారట. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్జిన్ షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.

ఈజీగా అనుమతి..

ఎవరెస్ట్ శిఖరానికి చేరుకోవాలంటే నేపాల్ గుండా వెళ్లాలి. విశేషమేమిటంటే ఎవరెస్ట్ పర్వతం నేపాల్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. స్థానికులకు కూడా ఇక్కడ ఉపాధి లభిస్తుంది. నేపాల్ ప్రభుత్వం భారతీయ పౌరులను 1500 నేపాలీ రూపాయలకు ప్రవేశ అనుమతిని ఇస్తుంది. అయితే దానిని ఎక్కడానికి లక్షల రూపాయలు ఖర్చవుతుంది.

మరణాలు ఎందుకు సంభవిస్తాయి ?

ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్మశానవాటిక అని, అక్కడ మరణించిన వారి మృతదేహాలను తిరిగి తీసుకురాలేరని చెబుతారు. ఈ మృతదేహాలు మంచులో పాతిపెడతారట. ఈసీగా అనుమతులు, సరైన ఫిట్‌నెస్ పరీక్షలు లేకపోవడం వల్ల, ప్రజలు ఎటువంటి అనుభవం లేకుండానే ఎక్స్‌డిషన్ కంపెనీలకు డబ్బు చెల్లించి ఎవరెస్ట్‌కు వెళతారు. ఈ వ్యక్తుల కారణంగా ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గం రద్దీ పెరుగుతుంది.

మానవుని శరీరం అధిక ఎత్తును తట్టుకోదు. మనుషులు 8 వేల అడుగుల ఎత్తుకు వెళ్లగానే తలనొప్పి, వాంతులు, తల తిరగడం మొదలవుతాయి. అలాంటప్పుడు సిలిండర్‌లో ఉన్న ఆక్సిజన్‌లోని ప్రతి నిమిషం విలువైనదిగా మారుతుంది. అంతే కాదు సెరిబ్రల్ ఎడెమా మెదడులో వాపుకు కారణమవుతుంది. ఇలాంటి అనారోగ్య కారణాల వలన ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతారు. దాంతో వారి మృతదేహాలను శిఖరం పైనే ఖననం చేస్తారట.

Tags:    

Similar News