'రష్యా వక్షోజాలు' చాలా స్పెషల్.. వీళ్ల కోసం ఓ డాక్టర్ ఇలా.! (వీడియో)
ఇలాంటి రొమ్ములకు 'రోస్‌గుర్డ్' అని పేరు కూడా పెట్టారు. Plastic Surgeon Introduces Breast Implants With Russian Flag.
దిశ, వెబ్‌డెస్క్ః నిజమైన దేశభక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే, రష్యా వెళ్లాల్సిందేనేమో మరి! లేకపోతే, దేశం కోసం ప్రాణాలు అర్పించడం విన్నాం గానీ, దేశం కోసం వక్షోజాలను మార్చుకోవడం మాత్రం వింతగా ఉంది. అవును, రష్యాలోని ఓ ప్లాస్టీక్ సర్జ్‌న్ రష్యా జాతీయ జెండాతో, రష్యన్ మిలటరీ రంగులతో ఉన్న బ్రెస్ట్‌ను కావాలనుకున్న మహిళలకు ఇంప్లాంట్ చేస్తున్నాడు. మాస్కోకు చెందిన యెవ్జెనీ డోబ్రేకిన్ అనే ఈ డాక్టర్ 'నిజమైన దేశభక్తుల' కోసం ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్‌లను ప్రోత్సహిస్తున్నానని చెబుతున్నాడు. ఇలాంటి రొమ్ములకు 'రోస్‌గుర్డ్' అని పేరు కూడా పెట్టారు.
వక్షోజం ఇంప్లాంట్లు స్పష్టంగా సిలికాన్‌తోనే చేసినవి, అయితే, పూత మాత్రమే భిన్నంగా ఉంటుంది. 'ది రష్యన్ ట్రైకలర్', 'ఆర్మీ కమ్మోఫ్లోజ్' అనే రెండు విభిన్న స్టైల్స్‌లో వీటిని అందిస్తున్నారు. తమ మాతృభూమిని ప్రేమించే వారికి, పచ్చబొట్టులు, స్టిక్కర్ల కంటే మరింత ఎక్కువ దేశభక్తి ఉన్నవారి కోసం వీటిని రూపొందించినట్లు చెబుతున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ సర్జన్ ఇచ్చిన వివరాల ప్రకారం, ఈ రంగుల పూత పూర్తిగా సురక్షితమైనదని తెలుస్తుంది. అయితే, సాధారణంగా బ్రెస్ట్ ఇంప్లాంట్ శరీరం లోపల చేసేది. అంటే, ఒకసారి బ్రెస్ట్ ఇంప్లాంట్ అమర్చిన తర్వాత మీరు దాన్ని బయటకి చూడలేరు, అది శరీరం లోపల ఉంటుంది. మరి, ఈ 'రష్యా వక్షోజాలు' చర్మం బయటకి కనిపిస్తాయో లేదో స్పష్టత మాత్రం లేదు అని అంటున్నారు సోషల్ మీడియా వినియోగదారులు.
For real? Maybe I don't understand, but you can't actually see the surface of the implant once it's implanted, right? It's inside your body. Does it show through the skin or something?
— Michael L Wilde (@MichaelLWilde1) May 30, 2022