సముద్రంలో మునిగిన ఓడలు జీవావరణానికి మేలు.. తాజా అధ్యయనంలో వెల్లడి!
సముద్ర జీవులు ఉత్పాదకత పెరగడానికి అది కారణమవుతుంది. Shipwrecks Are Changing Life in The Deep Sea Positively.
దిశ, వెబ్‌డెస్క్ః జీవి పుట్టుకకు కారణం గురించి శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇక, ఇప్పటికైతే నీటి ఆనవాలు ఉండబట్టే భూమిపైన జీవులు బతుకుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనంవసరం లేదు. భూమిపైన ఎక్కువ శాతం వ్యాపించి ఉన్న చల్లని సముద్రపు అడుగుభాగంలో ఇప్పటికీ మనిషి కనుగొనలేని ఎన్నో జీవులు నివశిస్తున్నాయి. అయితే, ఈ నీటి జీవావరణానికి మేలు చేస్తున్న వాటిలో ఇప్పటికే మూడు మిలియన్లకు పైగా సముద్రంలో మునిగిపోయిన ఓడల కూడా కారణమేనని తాజా అధ్యయనం వెల్లడించింది. మునిగిన ఓడల్లో ఎక్కువ భాగం చెక్కతో తయారు చేయబడ్డాయి. సముద్రపు అడుగుభాగంలోని సూక్ష్మజీవుల ఆవాసాలను ఈ ఓడలు మారుస్తున్నప్పటికీ, కొత్త పరిశోధన చెబుతున్న ప్రకారం దాని ప్రభావం అంతా చెడ్డది కాదని, సముద్ర జీవులు ఉత్పాదకత పెరగడానికి అది కారణమవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని 19వ శతాబ్దపు నౌకలకు అపాయం కలిగించే రెండు ప్రదేశాల చుట్టూ ఉన్న సూక్ష్మజీవుల జీవిత వైవిధ్యాన్ని ఈ అధ్యయనం పరిశోధిస్తోంది. ఓడ మునిగిపోయిన 200 మీటర్ల దూరంలో ఉన్న పైన్, ఓక్ ముక్కలను ఉపయోగించి బయోఫిల్మ్‌ల నమూనాలను సేకరించారు అధ్యయనకారులు. 4 నెలల తర్వాత, అన్ని బ్యాక్టీరియా, ఆర్కియా, శిలీంధ్రాలతో సహా జన్యు శ్రేణిని ఉపయోగించి సూక్ష్మజీవులను కొలవగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక, ఈ అధ్యయనం చెక్క నౌకలు, సూక్ష్మజీవుల వైవిధ్యంపై ప్రభావం గురించి తెలియజేస్తుండగా, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో మాత్రమే వేలాది చమురు, గ్యాస్ ప్లాట్‌ఫారమ్‌లు, చమురు పైప్‌లైన్‌లు కూడా ఉన్నాయి కనుక ఇవి అక్కడున్న సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవడానికి తదుపరి పరిశోధనలు అవసరమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ పరిశోధన ఫ్రాంటియర్స్ ఇన్ మెరైన్ సైన్స్‌లో ప్రచురించారు.