గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బంగీ జంప్.. పడటం చూస్తే నోరెళ్లబెడతారంతే!
TV షోలో చేసిన రికార్డ్స్‌ను ఇప్పుడు రాన్ జోన్స్ బ్రేక్ చేశాడు. Man bungee jumping from 198 feet created Guinness World Records'.
దిశ, వెబ్‌డెస్క్ః బంగీ జంప్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది గానీ, కొందరు మాత్రమే అంత ధైర్యం చేసి ఆ జంప్ చేయగలరు. ఇక, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్థాయిలో బంగీ జంప్ చేయాలంటే ఇంకెంత ధైర్యం కావాలో ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోస్ట్ చేసిన ఈ బంగీ జంప్ వీడియో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక వ్యక్తి 198 అడుగుల ఎత్తు నుండి దూకి, ఒక కప్పు కాఫీలో డోనట్‌ను ముంచి రికార్డు సృష్టించాడు. రాన్ జోన్స్ అనే వ్యక్తి ఈ డోనట్ బంగీ జంపింగ్‌ను 60.553 మీ., అంటే, 198 అడుగుల 8 అంగుళాల ఎత్తైన నుండి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు. 2013లో US TV షోలో చేసిన రికార్డ్స్‌ను ఇప్పుడు రాన్ జోన్స్ బ్రేక్ చేశాడు.