Pakistan ISI : పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్‌గా మహ్మద్ ఆసిం మాలిక్

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నూతన డైరెక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిం మాలిక్ నియమితులయ్యారు.

Update: 2024-09-23 18:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నూతన డైరెక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిం మాలిక్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న నదీం అంజుమ్ స్థానంలో ఈనెల 30న ఆసిం మాలిక్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆసిం మాలిక్ ఇప్పటివరకు రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయంలో అడ్జుటాంట్ జనరల్‌గా వ్యవహరించారు. పాకిస్తాన్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా భావించే వజీరిస్తాన్, బెలూచిస్తాన్‌లలో ఆర్మీ అధికారిగా పనిచేసిన అనుభవం కూడా ఆసింకు ఉంది.


Similar News