రైల్లో రష్యాకు బయలుదేరిన కిమ్‌.. పుతిన్‌తో భేటీ.. ఆయుధాల డీల్‌పై చర్చ?

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ లగ్జరీ ట్రైన్‌లో రష్యాకు బయలుదేరి వెళ్లారు.

Update: 2023-09-11 11:24 GMT

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ లగ్జరీ ట్రైన్‌లో రష్యాకు బయలుదేరి వెళ్లారు. ఆదివారం సాయంత్రమే ఆ రైలు రాజధాని ప్యాంగ్యాంగ్‌ నుంచి రష్యాకు బయలుదేరింది. మంగళవారం రోజు రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌‌తో కిమ్‌ భేటీ అవుతారని పేర్కొంటూ దక్షిణ కొరియా, జపాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియాలో పర్యటించారని, రష్యాకు ఆయుధాలను విక్రయించేలా చర్చలు జరిపారని ఆ కథనాల్లో పేర్కొన్నారు.

ఇప్పుడు ఆ డీల్‌ను ఫైనలైజ్ చేసుకునేందుకే రష్యాకు కిమ్ బయలుదేరారని తెలిపారు. ఉత్తర కొరియా నుంచి రష్యాకు ట్రైన్‌లో జర్నీ టైమ్ 20 గంటలు. ఉత్తర కొరియా బార్డర్‌లోనే రష్యాకు చెందిన వ్లాదివోస్తోక్‌ నగరం ఉంది. చివరిసారిగా 2019లో ఈ సిటీలోనే పుతిన్, కిమ్ భేటీ అయ్యారు. ఈసారి కూడా అక్కడే ఇద్దరు నేతల మీటింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Similar News