Kamala Harris-Obama: కమలా హ్యారిస్ తరఫున ప్రచారం.. ట్రంప్ పై ఒబామా విమర్శలు

నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచం దృష్టి అంతా ఆ ఎన్నికలపైనే ఉంది. కాగా.. ఎన్నికల గురించి మాజీ అధ్యక్షుడు ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-11 05:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచం దృష్టి అంతా ఆ ఎన్నికలపైనే ఉంది. కాగా.. ఎన్నికల గురించి మాజీ అధ్యక్షుడు ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కమలాకు మద్దతుగా పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నట్లు నేను అర్థం చేసుకున్నాను. ఈ ఎన్నికలు చాలా కఠినంగా ఉండనున్నాయి. ఎందుకంటే చాలామంది అమెరికన్లు ఇంకా సమస్యలతోనే పోరాడుతున్నారు. ట్రంప్‌ వల్ల మేలు జరుగుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థంకావడం లేదు. ఆయన తన అహంకారం, డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటారు. సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే మనకు కావాలి. కమలామాత్రమే అలా చేయగలరని నేను నమ్ముతున్నాను’ అని ఒబమా అన్నారు.

ఎన్నికల రేసులో..

ఇకపోతే, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హ్యారిస్‌లు బరిలో నిలిచారు. అయితే, ఇరువురు నేతల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు మద్దతిచ్చారు. మొదట్లో కమలాకు మద్దతు ఇస్తున్నట్లు ఒబామా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ తర్వాత, ఆమెకు పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.


Similar News