ట్రూడో కార్యక్రమంలో ఖలిస్తాన్ నినాదాలు..కెనడా రాయబారికి భారత్ సమన్లు
దిశ, నేషనల్ బ్యూరో : కెనడాలోని టొరంటోలో జరిగిన ఖల్సాడే కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో : కెనడాలోని టొరంటోలో జరిగిన ఖల్సాడే కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు పెద్ద ఎత్తున ‘‘ఖలిస్తాన్ నినాదాలు’’ చేయడం వివాదానికి దారితీసింది. ఈసందర్భంగా జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. సిక్కు సమాజానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. కెనడా ప్రధాని కార్యక్రమంలో ‘‘ఖలిస్తాన్ నినాదాల’’ అంశంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా డిప్యూటీ హైకమిషన్‌ను భారత విదేశాంగ శాఖ సోమవారం సమన్లు ఇచ్చింది. భారత్‌లోని కెనడా రాయబారిని పిలిపించి.. ఆయన ఎదుట తమ ఆందోళనను వ్యక్తం చేసింది. ‘‘వేర్పాటువాదం, తీవ్రవాదం, హింసకు కెనడాలో చోటు ఉంటుంది అనేలా ఈ పరిణామాలు ఉన్నాయి. రాజకీయ లబ్ధి కోసం ఖలిస్తానీలను కెనడాలో ఉపేక్షిస్తున్నారు. ఇలాంటి ఘటనలు భారత్ -కెనడా సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కెనడాలోని భారత పౌరులకు హాని కలిగించే హింసాత్మక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి’’ అని ఈ అంశంపై భారత్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే ఎన్నికలు లక్ష్యంగా ఖలిస్తానీ ఓటర్ల చూపును ఆకర్షించేందుకు టొరంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమానికి కెనడాకు చెందిన అధికార, విపక్షాల నేతలు హాజరయ్యారు.