Kamala Harris: అక్రమ వలసలపై డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇలాంటి టైంలో అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు.

Update: 2024-10-17 07:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇలాంటి టైంలో అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. అమెరికాలో అక్రమ వలసపై రిపబ్లిక్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాగా.. ఇలాంటి టైంలో డెమొక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వలసల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై తొలి సంతకం చేస్తానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ సమస్య ప్రధానమైనది. ఈ సమస్య పరిష్కారంపై మేం దృష్టిసారించాం. అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై సంతకం చేస్తాను. ఈ బిల్లులో వలసల సమస్య పరిష్కారానికి వనరులు పెంచడం, ఎక్కవమంది న్యాయమూర్తులను నియమించడం, జరిమానాలు కఠినతరం చేయడం వంటి అంశాలు ఉంటాయి. సరిహద్దులను బలోపేతం చేసేందుకు బోర్డర్ ఏజెంట్లను నియమిస్తాం. ఇది అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు, సరిహద్దుల వెంబడి దేశంలోకి వస్తున్న డ్రగ్స్ నిరోధించేందుకు ఉపయోగపడుతోంది. మరో 20 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఈ సమస్యను పరిష్కరించగలిగే అధ్యక్షుడు ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు’ అని హారిస్‌ పేర్కొన్నారు.

కమలాపై ట్రంప్ ఫైర్

ఇకపోతే, ఇటీవలే కమలాహ్యారిస్ యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సమయంలో అక్రమ వలసలను నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేస్తానని ఆమె అన్నారు. అయితే కమలా వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. నాలుగేళ్లగా బోర్డర్ల దగ్గరకు వెళ్లన హ్యారిస్.. ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందా అని మండిపడ్డారు. అమెరికాలోకి అక్రమార్కులు ప్రవేశించి హత్యలు, రేప్ లు చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న పట్టణాలను ఆమె శరణార్థి శిబిరాలుగా మార్చేశారంటూ ఆరోపించారు.


Similar News