బ్రిటీష్ హై సెక్యూరిటీ జైల్లో వీళ్లద్దరికీ పెళ్లి!
తన పార్ట్‌నర్ స్టెల్లా మోరిస్‌తో వివాహం జరిగింది. Julian Assange weds Stella Moris in British High security prison.
దిశ, వెబ్‌డెస్క్ః వికీలీక్స్ అనగానే అంతర్జాతీయంగా ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు, అంతెందుకు పైసలు గడించే ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పడుతోంది. అంతటి సంచలనాత్మక వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ తాజాగా వివాహం చేసుకున్నారు. తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ స్టెల్లా మోరిస్‌తో తనకు బుధవారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి బ్రిటీష్ హై-సెక్యూరిటీ జైలే వేదిక అయ్యింది. ఈ కార్యక్రమంలో కేవలం నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులు, ఇద్దరు గార్డులు మాత్రమే హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగడించిన ఈ సంచలన జంట పెళ్లి చిన్న వేడుకగా జరిగింది. పదేళ్ల క్రితం అమెరికా సైనిక రికార్డులు, దౌత్య వ్యవహారాలను వికీలీక్స్ లీక్ చేయడంతో అసాంజ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. అతనిని అప్పగించాలని ఓ వైపు అమెరికా ఒత్తిడి చేస్తుండగా లండన్‌లోని బెల్మార్ష్ జైలులో అసాంజ్ జైలు జీవితం గడుపుతున్నారు. ఆయన్ను విడుదల చేయాలని అంతర్జాతీయంగా పలు క్యాంపైన్‌లు కూడా కొనసాగుతున్నాయి.
50 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్, తాను ఎటువంటి తప్పు చేయలేదని అంటున్నాడు. 2011లో మోరిస్ తన న్యాయ బృందంలో పని చేయడం ప్రారంభించినప్పుడు ఆమె పరిచయమయ్యింది. 2015 నుండి వారి సంబంధం కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కుంటున్న కాలంలో ఏడేళ్ల పాటు ఉన్న ఈక్వెడార్ రాయబార కార్యాలయంలోనే స్టెల్లా మోరిస్‌తో సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. ఇక, వీరి వివాహం రిజిస్ట్రార్ నేతృత్వంలో జైలు సందర్వన సమయంలో జరిగింది. వివాహ అనంతరం జైలు బయట, మోరిస్ వెడ్డింగ్ కేక్ కట్ చేసి, తమ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
Julian Assange's new bride Stella Moris makes tearful speech after cutting cake following today's #Assangewedding - "I love Julian with all my heart, I wish he was here" #FreeAssangeNOW @StellaMoris1 pic.twitter.com/nqiZfs7Gom
— WikiLeaks (@wikileaks) March 23, 2022