బేబీ పౌడర్ తో మహిళకు క్యాన్సర్.. బాధితురాలికి రూ. 375 కోట్ల పరిహారం ఇవ్వాలన్న కోర్టు
ప్రముఖ జాన్సన్ అండ్ జాన్స్ భారీ ఎదురు దెబ్బతగిలింది.
దిశ, డైనమిక్ బ్యూరో:ప్రముఖ జాన్సన్ అండ్ జాన్స్ దాని అనుబంధ సంస్థ కెవెన్యూ ఇన్ కార్పొరేటెడ్ కు భారీ ఎదురు దెబ్బతగిలింది. ఆ కంపెనీల బేబీ పౌడర్లు వాడంట వల్ల క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన ఓ బాధితురాలి కుటుంబానికి రూ375 కోట్లు పరిహారం చెల్లించాలని తాజాగా షికాగో కోర్టు ఆదేశించింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ కారణంగా కేన్సర్ సోకుతుందని ఆరోపిస్తూ ఇల్లినాయిస్ కు చెందిన థెరిసా గ్రేసియా అనే మహిళ కోర్టుకెక్కారు. ఈ కేసు కోర్టులో ఉండగానే థెరిసా 2020లో కేన్సర్ తో చనిపోయారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సభ్యులు జాన్సన్ అండ్ జాన్సన్, కెన్‌వ్యూ సంస్థలపై కేసు వేశారు. ఈ సంస్థలు విక్రయించే టాల్కర్ టాల్కమ్ పౌడర్‌లో ప్రమాదకర ఆస్బెస్టాస్ (రాతినార) ఉందని ఆరోపించారు. ఈ అవశేషాల వల్లే థెరిసా కేన్సర్ బారినపడ్డారని వాదించారు. వాదనలు విన్న షికాగో కోర్టు సదరు మహిళ మృతి చెందడానికి 30 శాతం బాధ్యత జే అండ్ జే అని మిగిలిన 70 శాతం బాధ్యత దాని అనుబంధ సంస్థ తీసుకోవాలని మృతురాలి కుటుంబానికి ఏకంగా రూ.375 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కాగా ఈ తీర్పుపై తాము పై కోర్టులో సవాల్ చేస్తామని జే అండ్ జే సంస్థ తెలియజేయగా కెన్ప్యూ సంస్థ ఇంకా స్పందించలేనట్లు తెలుస్తోంది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరులో కేన్సర్ కారకాలున్నట్టు పలు పరీక్షల్లో తేలడంతో అమెరికాలోని వేలాది మంది భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ పలు కోర్టుల్లో కేసులు పిటిషన్లు దాఖలు చేశారు. ఆస్బెస్టాస్ కేన్సర్ కారకంతో కలుషితం కావడం వల్ల దాని టాల్క్ ఉత్పత్తులు వ్యాధికి కారణమయ్యాయని ఆరోపించారు. ఈ పౌడర్ వాడకం వల్ల ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషులకు ప్రాణాంతక కేన్సర్‌లు వస్తాయని పలువురు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆరోపణలపై జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ స్పదిస్తూ తాము తయారు చేస్తున్న టాల్కమ్ పౌడర్‌లో ఎటువంటి కేన్సర్ కారకాలు లేవని వాదిస్తోంది. దాదాపు వందేళ్లుగా తమ ఉత్పత్తిని సరైన విధంగానే బ్రాండింగ్ చేసుకుంటున్నట్టు వివరించింది. ఇక, కెన్‌వ్యూ సైతం తమ టాల్కమ్ పౌడర్‌ని ఇకపై తయారు చేయమని గత నెలలో వెల్లడించింది.