'జపాన్' కీలక నిర్ణయం.. ఇక మీదట వారానికి 4 రోజులే పని!

ఒకప్పుడు జపాన్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది.. అమెరికా అణుబాంబు దాడులు. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో జపాన్ దేశ నిర్వచనం పూర్తిగా మారిపోయింది.

Update: 2024-08-31 17:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు జపాన్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది.. అమెరికా అణుబాంబు దాడులు. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో జపాన్ దేశ నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే టెక్నాలజీలో అగ్రశ్రేణి దేశాలకు జపాన్ సవాల్ విసురుతోంది. జపాన్ దేశ ప్రజలు క్రమశిక్షణకు, శ్రమకు మారు పేరు. వారు దేశాభివృద్ధి కొరకు పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అలాంటి శ్రామిక పౌరుల మంచి కోసం జపాన్ ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ ఉద్యోగులందరూ వారానికి నాలుగు రోజులే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అన్ని సంస్థలలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ నిర్ణయానికి గల ప్రధాన కారణం జపాన్ పౌరులు కుటుంబం, ఉద్యోగం రెండిటి మధ్య సమతుల్యతను సాధించేందుకేనని ప్రభుత్వం తెలిపింది.

అయితే, 'వారానికి 4 రోజుల పని, 3 రోజుల సెలవు విధానాన్ని' 2021 సంవత్సరంలోనే అమలు చేయాలని జపాన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. పలు సంస్థలు దీనిని వ్యతిరేకించాయి. అలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో కొంత కాలానికి జపాన్ వెనకపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ ప్రస్తుతానికి జపాన్ తీసుకున్న తాజా నిర్ణయంతో.. అన్ని రకాల సంస్థలు తప్పనిసరిగా వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వాల్సిందే.!

జపాన్ తీసుకున్న ఈ విధానపర నిర్ణయాన్ని ఇప్పుడు భారత్ లో కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు రోజుకు 8 గంటలు పని చేస్తున్నాం కదా, అలాంటి విధానం మన దేశంలో అమలైతే, రోజుకు 12 గంటలు పనిచేయాల్సి వస్తుంది, అంటే వారానికి 48 గంటలకు తగ్గకుండా పనిచేయాలన్నమాట.


Similar News