హమాస్ అధికార ప్రతినిధి అరెస్ట్..
పాలస్తీనాలో ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా పేరొందిన, హమాస్ అధికార ప్రతినిధి యూసఫ్‌ను ఇజ్రాయెల్ దళాలు అరెస్టు చేశాయి.
గాజా : పాలస్తీనాలో ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా పేరొందిన, హమాస్ అధికార ప్రతినిధి యూసఫ్‌ను ఇజ్రాయెల్ దళాలు అరెస్టు చేశాయి. గురువారం వెస్ట్‌బ్యాంక్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులు ఆపితే.. 200 మంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ రెడీగా ఉందని ఇటీవల కెనడాకు చెందిన 'ది గ్లోబ్ అండ్ మెయిల్'కు వెల్లడించింది ఇతడే. అంతర్జాతీయ మీడియాలో హమాస్ ప్రతినిధి తరుచుగా కనిపించే యూసఫ్.. గతంలో దాదాపు 24 ఏళ్లు ఇజ్రాయెల్ జైలులో ఉండి వచ్చాడు. అతడితో పాటు హమాస్‌కు చెందిన కీలకమైన మరో 60 మంది సభ్యులను వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ బంధించింది.