'గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే యుద్ధమే'

ఇజ్రాయెల్ - హమాస్ ఘర్షణ తీవ్రరూపు దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.

Update: 2023-10-13 11:13 GMT

టెహ్రాన్‌ : ఇజ్రాయెల్ - హమాస్ ఘర్షణ తీవ్రరూపు దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గాజాపై బాంబు దాడులను ఇజ్రాయెల్ ఆపకపోతే.. యుద్ధం మొదలయ్యే ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది. గాజా బార్డర్ నుంచి బలగాలను వెనక్కి పిలుచుకోవాలని ఇజ్రాయెల్ కు సూచించింది. లెబనాన్ రాజధాని బీరుట్ లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబ్ డొల్లాహియన్ ఈ కామెంట్స్ చేశారు.

‘‘గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే ఉద్రిక్తతలు మరింత పెరిగే ముప్పు ఉంది. ఈ సంక్షోభం మరింత పెద్దదై యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు’’ అని ఆయన చెప్పారు. లెబనాన్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుడానీతో భేటీ అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలోని హమాస్‌, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థలకు ఇరాన్‌ మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.


Similar News