బిగ్ అలర్ట్ : 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. !
దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే 48 గంటల్లో ఏ క్షణమైనా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసే అవకాశం ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే 48 గంటల్లో ఏ క్షణమైనా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసే అవకాశం ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈవిషయాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు తెలిపారంటూ కథనంలో ప్రస్తావించింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు, రాజకీయపరమైన నష్టాలపై ఇరాన్ ప్రస్తుతం విశ్లేషణలు చేస్తోందని పేర్కొంది. ఇజ్రాయెల్‌పై ఏ తరహా దాడి చేయాలి ? ఆ దేశంలోని ఏయే ప్రాంతాలపై దాడి చేయాలి ? ఏ సమయంలో దాడి చేయాలి ? అనే దానిపై ప్లానింగ్స్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎదుట రెడీగా ఉన్నాయని కథనం పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయనుందనే సమాచారంతో అమెరికా అలర్ట్ అయింది. ఇజ్రాయెల్‌లోని అమెరికన్లకు అడ్వైజరీని జారీ చేసింది. కాగా, సిరియాలోని డమస్కస్‌లో ఉన్న ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ ఏప్రిల్ 1న వైమానిక దాడి చేసింది. ఆ ఘటనలో ఇరాన్ కీలకమైన సైనిక జనరల్, మరో ఆరుగురు సైనిక అధికారులు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్‌లు తలపడటం మొదలుపెడితే.. పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.