Indonesia:ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై జారిన విమానం.. పలువురికి గాయాలు

ఇండోనేషియాలో(Indonesia) ఘోర విమాన ప్రమాదం తప్పింది.

Update: 2024-09-09 20:22 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఇండోనేషియాలో(Indonesia) ఘోర విమాన ప్రమాదం తప్పింది. సోమవారం ఇండోనేషియాలోని పపువా(Papuva) రీజియన్ యాపిన్‌ ద్వీపం (Yapen Islands) నుంచి రాజధాని జయపుర(Jayapura)కు త్రిగానా ఎయిర్‌(Trigana Air) కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా అదుపుతప్పి సమీపంలోని పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 42 మంది ప్రయాణికులు ఉన్నారు.అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరు చనిపోలేదు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ప్రమాదంపై వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి ఆర్ధ్యాన్ యూకీ(Ardhyan uki) తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా విమాన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఆసియాలోనే అత్యంత చెత్త విమానయాన రికార్డును ఇండోనేషియా మూటగట్టుకుంది. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి విపత్తులు తోడు కావడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకొంటోంది. ఇండోనేషియాలో 1945 నుంచి ఇప్పటి వరకూ వందకు పైగా విమాన ప్రమాదాలు జరగ్గా.. సుమారుగా 1300 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఏవియేషన్‌ సేఫ్టీ నెట్‌వర్క్‌ డేటా ప్రకారం తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2015లో త్రిగానా విమానం ఇదే ప్రాంతంలో కూలిపోవడంతో అందులో ఉన్న 54 మంది మరణించారు.


Similar News