సరిహద్దుల్లో చనిపోయింది భారతీయులే: భారత హైకమిషన్

Update: 2022-01-28 17:31 GMT

వాషింగ్టన్: అమెరికా-కెనడా సరిహద్దుల్లో చలికి మరణించిన కుటుంబాన్ని భారత్ చెందిన వారిగా అధికారులు వెల్లడించారు. ఈ నెల 19న కెనడా నుంచి అమెరికా లోకి ప్రవేశించే ప్రయత్నాల్లో విపరీత వాతావరణ పరిస్థితులకు నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. వీరిని భారత్‌కు చెందినవారిగా అనుమానించిన అధికారులు, స్పష్టత ఇవ్వలేకపోయారు. గతంలో ఇరు దేశాల సరిహద్దులో కెనడా భూభాగం వైపు భార్యభర్తలు, ఒక బాలిక‌తో పాటు శిశువు మృతదేహలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరు అమెరికా లోనికి ప్రవేశించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఘటనపై జరిపిన విచారణలో వాతావరణ పరిస్థితుల వల్ల వారు మరణించినట్లు నిర్ధారించారు. సరిహద్దు నుండి కేవలం 9-12 మీటర్ల దూరంలో మంచులో మృతదేహాలను గుర్తించారు. తాజాగా అధికారులు చేసిన దర్యాప్తుల్లో వీరంతా భారత్‌కు చెందినవారేనని నిర్ధారించారు.

కాగా వీరిలో బాలికగా అనుమానించిన మృతదేహం, బాలుడిదని తెలిపారు. వీరిని గుజరాత్‌కు చెందిన జగదీష్ బల్దేవ్ భాయ్(39), వైశాలిబెన్ జగదీష్ కుమార్ పటేల్ (37), విహంగీ(11), ధార్మిక్‌లుగా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. వీరి మరణాన్ని భారత హైకమిషన్ ధృవీకరించింది. అయితే వీరి మరణం వెనుక అక్రమ రవాణా ముఠా హస్తం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. వీరి మరణాలు వాతావరణ పరిస్థితులతో జరిగినట్లు పోస్టుమార్టం నివేదికల ఆధారంగా వెల్లడించారు. కెనడా లో అక్రమ మానవ రవాణా కేసులు తరుచూ జరుగుతుంటాయని చెప్పారు. కాగా, మృతదేహాలు లభించిన ప్రాంతానికి సమీపంలో ఎలాంటి వాహనం లేదని, బహుశా వాహనంలో తీసుకొచ్చి వదిలేసి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు.

Tags:    

Similar News