వెనుక బాంబుల వ‌ర్షం.. తాపీగా చిప్స్‌ తింటున్న ఉక్రెయిన్ సోల్జ‌ర్‌! (వీడియో)

తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్.. Ukrainian soldier snacks on chips as missiles are fired

Update: 2022-05-30 08:09 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః "తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్.. ఈసురోమని మనుషులుంటే.. దేశమే గతి బాగుపడునోయ్‌.." అని చెప్పిన‌ గుర‌జాడ మాట‌లు ఇక్క‌డ ప్ర‌స్తావించక త‌ప్ప‌దు. స‌రిగ్గా, ఈ మాట‌ల్ని పాటిస్తున్న వ్య‌క్తిలా క‌నిపిస్తాడు ఈ ఉక్రెయిన్ సైనికుడు. ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య యుద్ధం ఎంత తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతోందో అంద‌రికీ తెలుసు. న‌గ‌రాల‌కు న‌గ‌రాలు బాంబుల వ‌ర్షంతో కాలి బూడిద‌వుతున్నాయి. ఇలాంటి భ‌యాన‌క ప్ర‌దేశంలో ఓ సైనికుడు తన వెనుక వ‌రుస బెట్టి క్షిపణులు పేలుతుంటే, ఓ ప్యాకెట్‌లో చిప్స్ తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షిపణులను ప్రయోగిస్తున్న‌ వాహనం నుండి చాలా సాధార‌ణంగా, అక్క‌డేమీ జ‌ర‌గ‌ట్లేద‌న్న‌ట్లు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు ఇంట‌ర్నెట్‌లో జ‌నాల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. ఈ క్లిప్‌ను కీవ్ ఇండిపెండెంట్ కోసం డిఫెన్స్ రిపోర్టర్ ఇలియా పొనోమరెంకో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై విభిన్న కామెంట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ, దేశ ర‌క్ష‌ణ కోసం పాటుప‌డే వారికి తిండే లేక‌పోతే, ఆ దేశ‌ ప్ర‌జ‌లు ప‌రాయి పాల‌న‌లో మ‌ళ్లీ బానిస‌లవుతారని కొంద‌రు నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు. 


Similar News