Imran Khan: 'ఒక కేసులో బెయిల్.. మరో కేసులో కస్టడీ'.. కేసుల ఊబిలో ఇరుక్కున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని

కేసుల ఊబిలో ఇరుక్కున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌‌పై న్యాయ విచారణ కొనసాగుతోంది.

Update: 2023-08-30 10:54 GMT

ఇస్లామాబాద్: కేసుల ఊబిలో ఇరుక్కున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌‌పై న్యాయ విచారణ కొనసాగుతోంది. తోషాఖానా అవినీతి కేసులో ఆయనకు ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను అక్కడి హైకోర్టు నిలిపివేసినా ఊరట దక్కలేదు. ఇమ్రాన్ జైలు నుంచి విడుదలవుతారని అందరూ భావించినప్పటికీ అలా జరగలేదు.

దేశ అధికారిక రహస్యాలను బహిరంగపరిచారన్న ఆరోపణలపై నమోదైన మరో కేసులో స్పెషల్ జడ్జి బుధవారం నేరుగా పంజాబ్‌ ప్రావిన్సులోని అటక్‌ జైలుకు వెళ్లి ఇమ్రాన్ ను విచారించారు. ఆ కేసులో ఇమ్రాన్‌కు సెప్టెంబర్‌ 13 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. భద్రతా కారణాల వల్లే ఇమ్రాన్‌ను జైలులోనే ఉంచి న్యాయ విచారణ చేస్తున్నట్టు తెలిసింది.


Similar News