యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవిని చేపట్టిన హంగేరీ

యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధ్యక్ష పదవిని జూలై 1న హంగేరీ స్వీకరించింది. రొటేషన్ ప్రాతిపదికన ఈ బాధ్యతలు లభించాయి

Update: 2024-07-01 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధ్యక్ష పదవిని జూలై 1న హంగేరీ స్వీకరించింది. రొటేషన్ ప్రాతిపదికన ఈ బాధ్యతలు లభించాయి. దీంతో ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌ను తదుపరి ఆరు నెలలకు ప్రాంతీయ కూటమికి కొత్త అధిపతిగా ఉంటారు. విక్టర్ రష్యాకు అనుకూలంగా ఉంటారని పేరుంది, దీంతో ఆయన ఇప్పుడు ఈయూ అధ్యక్ష పదవిని చేపట్టడంతో రష్యా వ్యతిరేక దేశాలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి. ఇదిలా ఉంటే విక్టర్ నిజాయితీగా పనిచేస్తానని, అన్ని సభ్య దేశాలు, సంస్థలతో విధేయతతో పని చేస్తానని వాగ్దానం చేశారు.

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి రష్యాతో సంబంధాలను కొనసాగించిన ఏకైక దేశం హంగేరీ. రష్యాపై పలు దేశాల ఆంక్షలు విధించిన ప్రతిసారీ హంగేరీ ప్రభుత్వం ఖండించింది. గతంలో ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌ ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపడానికి నిరాకరించాడు. అంతకుముందు హంగేరియన్ ఈయూ వ్యవహారాల మంత్రి జానోస్ బోకా మాట్లాడుతూ, బలమైన యూరోపియన్ విధానాన్ని అనుసరించడానికి హంగేరీకి బలమైన ఆదేశం ఉంది, మా పని ఐరోపా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

Similar News