భారీ భూకంపం .. 15 మంది మృతి
ఈక్వెడార్‌లో భారీ భూకంపం సంబవించింది. రెండవ అతిపెద్ద నగరమైన గ్వాయాక్విల్‌కు దక్షిణంగా 50 మైళ్ల దూరంలో పసిఫిక్ తీరానికి కేంద్రీకృతమై
దిశ, వెబ్‌డెస్క్: ఈక్వెడార్‌లో భారీ భూకంపం సంబవించింది. రెండవ అతిపెద్ద నగరమైన గ్వాయాక్విల్‌కు దక్షిణంగా 50 మైళ్ల దూరంలో పసిఫిక్ తీరానికి కేంద్రీకృతమై దాదాపు 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు U.S. జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా.. మొత్తం 15 మంది మృతి చెందారు. అలాగే వందల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.