శ్రీలంకలో భారీ వర్షాలు..15 మంది మృతి

శ్రీలంకలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ దేశ రాజధాని కొలంబోతో సహా 7 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.

Update: 2024-06-03 05:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంకలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ దేశ రాజధాని కొలంబోతో సహా 7 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇక్కడ 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. బలమైన ఈదురు గాలుల వల్ల చెట్లు, కొండచరియలు నేలకొరిగాయి. పలు ఘటనల్లో 15 మంది మరణించారు. 5,000 కుటుంబాలకు చెందిన19,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 4,000కు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా..28 ఇళ్లు పూర్తిగా కూలిపోయినట్టు విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. సహాయక చర్యల నిమిత్తం శ్రీలంక సైన్యం పడవలతో కూడిన ఏడు బృందాలను ఘటనా ప్రాంతాల్లో మోహరించింది. తక్షణ అత్యవసర ప్రతిస్పందన కోసం వైమానిక దళం మూడు హెలికాప్టర్లను సిద్ధం చేసింది. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యా మంత్రిత్వ శాఖ అన్ని విద్యా సంస్థలను మూసి వేయనున్నట్టు ప్రకటించింది. అంతేగాక ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొండచరియలు విరిగిపడటంతో నేషనల్ బిల్డింగ్ రీసెర్చ్ సెంటర్ నాలుగు జిల్లాలకు రెడ్ నోటీసులు జారీ చేసింది.


Similar News