ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ వర్షాలు..50 మంది మృతి

ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఈ కారణంగా పలు ఘటనల్లో సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో 50 మంది మృతి చెందినట్టు సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌కు చెందిన సమాచార విభాగం అధిపతి మవ్లావి అబ్దుల్ హై జయీమ్ శనివారం వెల్లడించారు.

Update: 2024-05-18 09:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఈ కారణంగా పలు ఘటనల్లో సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో 50 మంది మృతి చెందినట్టు సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌కు చెందిన సమాచార విభాగం అధిపతి మవ్లావి అబ్దుల్ హై జయీమ్ శనివారం వెల్లడించారు. శుక్రవారం ప్రారంభమైన వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం స్థంభించినట్టు తెలిపారు. భారీ వరదల వల్ల ఈ ప్రాంతానికి రాకపోకలు సైతం నిలిచిపోయినట్టు పేర్కొన్నారు. సెంట్రల్ ప్రావిన్స్ రాజధాని ఫిరోజ్-కోలో 2,000 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 4,000 పాక్షికంగా దెబ్బతిన్నాయని, 2,000 కంటే ఎక్కువ దుకాణాలు నీటిలో మునిగిపోయాయని జయీమ్ తెలిపారు. అలాగే ఆఫ్ఘన్ వైమానిక దళం ఉపయోగించే హెలికాప్టర్, ఘోర్ ప్రావిన్స్‌లోని నదిలో పడిపోయిన వ్యక్తుల మృతదేహాలను వెలికితీసే సమయంలో సాంకేతిక సమస్య కారణంగా కూలిపోగా ఒకరు మరణించగా.. 12 మంది గాయపడినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, గత వారం భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో 315 మంది మరణించారు. ,1600 మందికి పైగా గాయపడ్డారు. వాతావరణ మార్పులకు అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో ఆప్ఘనిస్థాన్‌ ఒకటని ఐక్యరాజ్యసమితి గతంలో పేర్కొంది. 

Tags:    

Similar News