ప్ర‌పంచంలోనే అత్యంత పొడ‌వైన కారు! స్విమ్మింగ్ పూల్‌, హెలీప్యాడ్ కూడా...

World's longest car restored in America.

Update: 2022-03-10 12:24 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారును దాదాపు 50 ఏళ్ల క్రితం న్యూస్ పేప‌ర్లోనో, మ్యాగ‌జైన్స్‌లోనో చూసుండొచ్చు. అయితే, ఇప్పుడు దాన్ని మ‌ళ్లీ రీమోడ‌ల్‌ చేసి, బ‌య‌ట‌కు తీశారు. ఇప్పుడో ఫోటో కాదు, దానికున్న సౌక‌ర్యాలను వీడియోలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. 100 అడుగుల, 1.5 అంగుళాల పొడవు ఉన్న ఈ కారు త‌న సొంత గిన్నిస్ వ‌ర‌ల్డ్‌ రికార్డును తానే బద్దలుకొట్టింది. "అమెరికన్ డ్రీమ్‌" అనే పేరు పెట్టుకున్న ఈ సూపర్ లిమోసిన్‌ను 1986లో కార్ల‌ కస్టమైజర్ అయిన జే ఓర్‌బర్గ్ త‌యారుచేశాడు. అప్పుడ‌ది 60 అడుగుల పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

తాజాగా మ‌రోసారి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ వారు త‌మ మీడియా వేదిక‌ల‌పై ఈ కారు పున‌రాగ‌మ‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఓర్‌బర్గ్ ఇప్పుడు ఈ కారును 100 అడుగుల పొడవుకు పెంచి, అత్యంత పొడవైన కారుగా రూపొందించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను మ‌రోసారి కైవసం చేసుకున్నాడు. ఈ కారు అప్ప‌ట్లో అమెరిక‌న్ సినిమాల్లో చాలా సార్లు మెరిసింది. త‌ర్వాత న్యూజెర్సీ వేర్‌హౌస్‌లో చాలా సంవత్సరాలు నిరుప‌యోగంగా ఉంది. దాని మెయింటెనెన్స్ కోసం డ‌బ్బులు స‌రిపోక అలా వ‌దిలేశారు. 2019లో ఓర్లాండోలోని ఫ్లాలో ఉన్న‌ డెజర్లాండ్ పార్క్ కార్ మ్యూజియం అండ్ టూరిస్ట్ అట్రాక్ష‌న్ కంపెనీ యజమాని మైఖేల్ డెజర్ దీన్ని కొన్నారు. రీ మోడ‌ల్ చేసిన ఈ కారులో హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్, పుటింగ్ గ్రీన్, పెద్ద వాటర్‌బెడ్‌లు అమ‌ర్చారు. దీని త‌యారీ వీడియోను గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ వారు యూట్యూబ్‌లో ఉంచారు. 

Full View

Tags:    

Similar News