Muhammad Yunus : యూనుస్ పదవి నుంచి దిగిపోండి.. అమెరికాలో బంగ్లాదేశీయుల నిరసన

దిశ, నేషనల్ బ్యూరో : ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌కు వచ్చిన బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్‌కు చేదు అనుభవం ఎదురైంది.

Update: 2024-09-25 13:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌కు వచ్చిన బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన బస చేసిన హోటల్ వద్ద బంగ్లాదేశీయులు నిరసనకు దిగాారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను వ్యతిరేకిస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు. మైనారిటీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

గో బ్యాక్, పదవి నుంచి దిగిపోండి అంటూ ఆందోళనకారులు స్లోగన్స్ ఇచ్చారు. హిందువులపై దాడులను ఆపలేని ప్రభుత్వం తమకు అక్కర్లేదన్నారు. కుటిల రాజకీయాల ద్వారా మహ్మద్ యూనుస్ బంగ్లాదేశ్‌లో అధికారంలోకి వచ్చారని ఓ నిరసనకారుడు ఆరోపించాడు. కాగా, ఈనెల 27న జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో యూనుస్ ప్రసంగించనున్నారు. 


Similar News