బ్రిటన్‌లో నలుగురు భారతీయులకు జీవితఖైదు: ఓ హత్య కేసులో కోర్టు తీర్పు
బ్రిటన్‌లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు అక్కడి కోర్టు 122ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ భారతీయ డ్రైవర్ హత్య కేసులో వారు దోషులుగా తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్‌లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు అక్కడి కోర్టు 122ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ భారతీయ డ్రైవర్ హత్య కేసులో వారు దోషులుగా తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆగస్టులో భారత సంతతికి చెందిన డెలివరీ డ్రైవర్ అర్మాన్ సింగ్‌పై..అర్షదీప్ సింగ్, జగ్దీప్ సింగ్, శివ్‌దీప్ సింగ్, మన్‌జ్యోత్ సింగ్ అనే నలుగురు నిందితులు కిరాతకంగా దాడి చేసి చంపేశారు. గొడ్డలి, గోల్ఫ్ క్లబ్, మెటల్ క్లబ్, హాకీ స్టిక్, పార, హాకీ బ్యాట్, క్రికెట్ బ్యాట్, కత్తితో విచక్షణా రహితంగా కొట్టి చంపారు. అనంతరం కేసు నమోదు చేసిన వెస్ట్ మెర్సియా పోలీసులు దర్యాప్తు చేపట్టి కొద్ది రోజుల తర్వాత నిందితులను అరెస్టు చేశారు. అప్పటి నుంచి దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నిందితులు నేరం చేసినట్టు రుజువు కావడంతో కోర్టు తుది తీర్పు వెల్లడించింది.
అర్ష్‌దీప్ సింగ్, జగ్దీప్ సింగ్, శివదీప్ సింగ్ మరియు మంజోత్ సింగ్‌లకు ఒక్కొక్కరికి 28 ఏళ్ల జైలు శిక్ష విధించగా..నిందితుడిపై దాడి చేసేందుకు సహాయ పడిన సుఖ్‌మన్‌దీప్ సింగ్‌కు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. ‘ఈ వ్యక్తులకు ముఖ్యమైన శిక్షలు విధించబడినందుకు సంతోషిస్తున్నా. నిందితులు ప్రమాదకరమైన వ్యక్తులు. వారు ఇప్పుడు జైలులో గణనీయమైన శిక్షను అనుభవిస్తారు. అక్కడ వారు ప్రజలకు హాని కలిగించలేరు’ అని వెస్ట్ మెర్సియా పోలీస్ చీఫ్ ఇన్స్పెక్టర్ మార్క్ బెల్లామీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తును బెల్లామీనే చేపట్టారు.