కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం

నేపాల్‌లో అనూహ్య ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో నేపాల్‌లోని ఖాట్మాండులో హెలికాప్టర్ కుప్పకూలింది.

Update: 2024-08-07 10:54 GMT
కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో అనూహ్య ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో నేపాల్‌లోని ఖాట్మాండులో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ సమయంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బుధవారం నువాకోట్‌ జిల్లాలో ఎయిర్‌ డైనస్టీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీ శాంతిరాజ్‌ కొయిరాలా మీడియాకు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News