డ్యాం కూలి 50 మంది మృతి.. ఎక్కడంటే..?

Update: 2024-04-29 16:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం తెల్లవారుజామున ఓ డ్యాం తెగిపోయింది. దీంతో రాజధాని నైరోబికి 60కి.మీ దూరంలో ఉన్న మాయి మాహియు పట్టణ సమీపంలోని పలు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనలో 50మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ రెడ్ క్రాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజర్ ఆంథోని ముచరి వెల్లడించారు. ఇప్పటివరకు 42 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిలో 17 మంది మైనర్లేనని తెలిపారు. నిద్రలో ఉండగానే వారిని వరదలు తుడిచిపెట్టుకుపోయాయని, ఇళ్లన్నీ కొట్టుకుపోయాయని వెల్లడించారు. వాహనాలు బురదలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. కాగా, భారీ వర్షాలు వరదల కారణంగా తాజా మరణాలతో కలిపి గత నెల నుంచి ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 140కి చేరడం గమనార్హం.



Similar News