ఫ్లాష్.. ఫ్లాష్..! హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం

బీరుట్‌ సమీపంలోని హిజ్బుల్లా సంస్థ ప్రధాన కార్యాలయంపై గురువారం జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం అధికారికంగా ప్రకటించింది.

Update: 2024-09-28 08:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీరుట్‌ సమీపంలోని హిజ్బుల్లా సంస్థ ప్రధాన కార్యాలయంపై గురువారం జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ ‘X’ (ట్విట్టర్) ఖాతాలో ‘హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయపెట్టలేరు’, ‘హసన్ నస్రల్లా చనిపోయాడు’ అంటూ ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ శోషాని వెల్లడించారు. అదేవిధంగా మిలిటరీ ప్రతినిధి కెప్టెన్ డేవిడ్ అవ్రహం కూడా హసన్ నస్రల్లా హతమైన విషయాన్ని ధృవీకరించారు.


Similar News