Plane crash: కాలిఫోర్నియాలో కూలిన విమానం.. ఐదుగురు మృతి

కాటాలినా ద్వీపంలో ఓ విమానం కూలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.

Update: 2024-10-09 15:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ కాలిఫోర్నియాలో విషాదం చోటు చేసుకుంది. కాటాలినా ద్వీపంలో ఓ విమానం కూలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపిన వివరాల ప్రకారం.. ట్విన్-ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ 95 అనే విమానం మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో అవలోన్ ద్వీప పట్టణానికి సమీపంలో ఉన్న కాటాలినా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అనంతరం కాసేపటికే క్రాష్ అయింది. విమానాశ్రయానికి పశ్చిమాన రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్టు వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు వ్యక్తులు ఉండగా అందరూ మరణించినట్టు ఎఫ్ఏఏ తెలిపింది. ఈ ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేపడుతోంది.


Similar News