Pakistan | హిందూ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని మనవరాలు

Update: 2023-05-03 09:28 GMT

దిశ వెబ్ డెస్క్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. అయితే వివాహం అనంతరం ఫాతిమా తన భర్తతో కలిసి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం పాకిస్తాన్‌లో చర్చకు దారి తీసింది. వివాహానంతరం హిందూ దేవాలయాన్ని సందర్శించి తను ఒక లౌకికవాదిని అని ఆమె నిరూపించింది.

ఫాతిమా భుట్టో కాబూల్‌లో జన్మించారు. ఆమె సిరియా, కరాచీలలో పెరిగారు. నార్డ్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీని, లండన్లోని SOAS విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.

ఫాతిమా ముందు నుంచి సెక్యులర్ భావాలు కలిగిన మహిళ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాతిమా దేవాలయంలో పూజలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కొంతమంది ఆమెను అభినందిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.

ఫాతిమా తండ్రి ముర్తాజా భుట్టో పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు. వృత్తి రీత్యా ఫాతిమా ఒక రచయిత్రి, కాలమిస్ట్. అన్ని మతాలను గౌరవించే ఆమె గత శుక్రవారం అమెరికా పౌరుడు గ్రాహం (గిబ్రాన్)ని వివాహం చేసుకుంది. ఫాతిమా వివాహ వేడుకకు దేశ విదేశాంగ మంత్రి, బావ బిలావల్ భుట్టో దూరంగా ఉన్నారు.

వివాహం అనంతరం ఆదివారం ఫాతిమా తన భర్తతో కలిసి కరాచీలోని చారిత్రాత్మక మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. ఫాతిమా దంపతులు పరమశివుడికి ప్రీతిపాత్రమైన పాలభిషేకం చేశారు. అనంతరం రుద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. వీరు పూజలు చేస్తున్న ఫోటో ఒకటి షోషల్ మీడియాను కుదిపేసింది.

మీడియా కథనాల ప్రకారం, ఫాతిమా భర్త గ్రాహం క్రిస్టియన్, అమెరికన్ పౌరుడు. ఫాతిమాతో పాటు ఆమె సోదరుడు జుల్ఫికర్ అలీ భుట్టో జూనియర్.. హిందూ నాయకులు కూడా ఉన్నారు. ఆలయంలో దర్శన సమయంలో ఫాతిమా కూడా మహాదేవునికి ఆవు పాలుతో అభిషేకం చేశారు.

ఫాతిమా భుట్టో కుటుంబం

సైనిక తిరుగుబాటు అనంతరం జుల్ఫికర్ అలీ భుట్టోను 1979 ఏప్రిల్‌లో అప్పటి సైనిక నియంత జియా-ఉల్-హక్ ఉరితీసిన సంగతి తెలిసిందే. జుల్ఫికర్ పెద్ద కుమార్తె బెనజీర్ భుట్టో డిసెంబర్ 2007లో రావల్పిండిలో హత్యకు గురైంది. సెప్టెంబర్ 1996లో, బెనజీర్ సోదరుడు ముర్తజా భుట్టో కూడా క్లిఫ్టన్‌లో హత్యకు గురయ్యారు. ముర్తాజా తమ్ముడు షానవాజ్ భుట్టో 1985లో ఫ్రాన్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు.

Tags:    

Similar News