సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది దుర్మరణం

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఓక్బాత్ షియార్‌లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు నేరుగా వెళ్లి వంతెనను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Update: 2023-03-28 02:34 GMT

దిశ, వెబ్ డెస్క్: సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఓక్బాత్ షియార్‌లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు నేరుగా వెళ్లి వంతెనను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది దర్మరణం పాలవగా, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి ఓ వార్తా పత్రిక కథనం ప్రకారం.. ప్రమాదం అసిర్ ప్రావిన్స్, అభా నగరం మధ్య వెళ్లే రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.

బస్సు బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా వంతెనను ఢీకొట్టి ఒక్కసారిగా బోల్తా కొట్టడంతోనే బస్సులో మంటలు చేలారేగాయని పేర్కొంది. సివిల్ డిఫెన్స్ , సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పర్యవేక్షంచాయి. మృతులు, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. బస్సు పూర్తిగా దగ్ధమైన దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. యెమెన్‌ సరిహద్దులోని నైరుతి అసిర్‌ ప్రావిన్స్‌లో వాహనం బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Tags:    

Similar News