95 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా: యూకేకు చెందిన వ్యక్తి ఘనత

95 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పొంది చదువుకు వయసుతో సంబంధం లేదని యూకేకు చెందిన ఓ వృద్ధుడు నిరూపించాడు. లండన్‌లోని సర్రేలో నివసిస్తున్న డేవిడ్ మార్జోట్ 95ఏళ్ల వయసులో కింగ్ స్టన్ విశ్వవిద్యాలయం నుంచి మాడరన్ యూరోపియన్ ఫిలాసఫీలో

Update: 2024-02-06 05:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 95 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పొంది చదువుకు వయసుతో సంబంధం లేదని యూకేకు చెందిన ఓ వృద్ధుడు నిరూపించాడు. లండన్‌లోని సర్రేలో నివసిస్తున్న డేవిడ్ మార్జోట్ 95ఏళ్ల వయసులో కింగ్ స్టన్ విశ్వవిద్యాలయం నుంచి మాడరన్ యూరోపియన్ ఫిలాసఫీలో ఎంఏ పూర్తి చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనకు పట్టాను సైతం ప్రదానం చేసినట్టు పేర్కొంది. మరొక కోర్సు చదివేందుకు కూడా మార్జోట్ ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. 2021లో 96 ఏళ్ల వయసులో ఆర్చివైట్ అనే వ్యక్తి బ్రైటన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడు కాగా..తాజాగా మార్జోట్ 95ఏళ్ల వయసులో పట్టబద్రుడు కావడం గమనార్హం. పట్టా ప్రదానోత్సవం రోజున మార్జోట్ మాట్లాడుతూ..ఒక రంగంలో ఆసక్తి ఉంటే వయసుతో సంబంధం లేకుండా దానిని పూర్తి చేయొచ్చని తెలిపారు. తన డిగ్రీ పూర్తి చేయడానికి సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మార్జోట్ రిటైర్డ్ సైక్రియాటిస్టు కావడం గమనార్హం. 

Tags:    

Similar News