అంత టైమ్ నీటిలో నడిచి వరల్డ్ రికార్డ్ సాధించాడు! ఇదే కారణం..?!
క్రొయేషియాకు చెందిన ఫ్రీడైవర్ రికార్డు సృష్టించాడు.Croatian Sets Gunnies World Record For Longest Underwater Walk
దిశ, వెబ్‌డెస్క్ః కొందరికి నీళ్లంటేనే చాలా భయం. ఇంకొందరికి నీళ్లల్లో దిగాలంటే, మరికొందరికి నీటిలో మునగాలంటే చచ్చేంత దడ. మరి ఈ వ్యక్తి మాత్రం నీళ్లల్లో ఎక్కువ సేపు నడిచి రికార్డు బద్దలు కొట్టాడు. క్రొయేషియాకు చెందిన ఫ్రీడైవర్ ఒకే ఒక్కసారి శ్వాస తీసుకొని నీటి లోపల ఎక్కువసేపు నడిచి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇటీవల ఈ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWS) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. వృత్తిపరంగా ఫ్రీడైవర్ అయిన విటోమిర్ మారిసిక్, 3 నిమిషాల 6 సెకన్ల సమయం చేతిలో ఒక బార్‌బెల్ ప్లేట్‌ను పట్టుకుని యాభై మీటర్ల స్విమ్మింగ్ పూల్ (107 మీటర్లు)లో ఈ ఫీట్‌ను సాధించాడు. దీనికి ముందు రికార్డును గమనిస్తే, 2020 మార్చిలో క్రొయేషియా దేశానికే చెందిన ఫ్రీడైవర్ బోరిస్ మిలోసిక్ 96 మీటర్లు నడిచాడు. ఇక, తాజా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, మారిసిక్ ఈ ఫీట్ సాధించడానికి ఎలాంటి శిక్షణ కూడా పొందకపోవడం విశేషం. అయితే, ఈ ఫీట్ చేయడానికి మారిసిక్ ఓ సామాజిక కారణాన్ని కూడా వేదికగా చేసుకున్నాడు. గుండె, ఊపిరితిత్తులు, రుమాటిక్ వ్యాధుల పునరావాసం కోసం క్రొయేషియాలోని తల్లాసోథెరపియా ఒపాటిజా ఆసుపత్రి స్విమ్మింగ్ పూల్‌ను ఎంచుకున్నాడు.