నదిలోనే కుప్పకూలిన బ్రిడ్జ్: అమెరికాలో ఘోర ప్రమాదం

అమెరికాలో ఓడ ఢీకొన్న కారణంగా బాల్టిమోర్‌లోని ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ’ అనే బ్రిడ్జి కూలిపోయింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

Update: 2024-03-26 08:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఓడ ఢీకొన్న కారణంగా బాల్టిమోర్‌లోని ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ’ అనే బ్రిడ్జి కూలిపోయింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పటాప్‌స్కో నదిపై ఉన్న బ్రిడ్జిని ఓ భారీ కంటైనర్ షిప్ ఢీకొట్టడంతో అది నదిలోనే కుప్పకూలింది. దీంతో ఆ టైంలో బ్రిడ్జిపైనున్న వాహనాలు నీటిలో పడిపోయాయి. ఓడలో కూడా మంటలు చెలరేగి మునిగిపోయినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తర్వాత, రెండు వైపుల నుంచి అన్ని మార్గాలను మూసివేసి ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ తెలిపింది. ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. అయితే వాహనాలు నీటిలో మునిగి పోవడంతో పలువురు మృతి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్రిడ్జి కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్రిడ్జిని ఢీకొన్న నౌకను సింగపూర్ కు చెందిన ‘డాలీ’గా గుర్తించినట్టు సమాచారం. ఇది శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కాగా, 1977లో మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను నిర్మించారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ అమెరికా జాతీయ గీతాన్ని రాసిన వ్యక్తి. 

Tags:    

Similar News