2035కల్లా చంద్రుడిపై చైనా పరిశోధనా కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో : చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2035 సంవత్సరంకల్లా అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని చైనా యోచిస్తోంది.

Update: 2024-04-27 18:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2035 సంవత్సరంకల్లా అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని చైనా యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను తాజాగా విడుదల చేసింది. ‘ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్’ పేరిట రెండు దశల్లో అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని చైనా నిర్మించనుంది. సూర్యరశ్మి సోకని ప్రదేశం కావడం వల్లే పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు దక్షిణ ధ్రువాన్ని చైనా ఎంచుకుంది. ఈ ప్రాంతంలో నీటి నిల్వలు కూడా ఉన్నాయని అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటిదశలో భాగంగా 2035 నాటికి దక్షిణ ధ్రువంపై ప్రాథమిక పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తారు. రెండోదశలో భాగంగా 2045 నాటికి పూర్తిస్థాయిలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ పరిశోధన ఫలాలు కేవలం చంద్రుడిపై పరిశోధనకే కాకుండా అంగారకుడిపై కాలిడేందుకు కూడా ఉపయోగపడతాయని చైనా పేర్కొంది. మరోవైపు, అమెరికా, ఐరోపా దేశాలు చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ఆర్టమిస్ మిషన్‌ను అమెరికా చేపట్టింది.

Tags:    

Similar News