China : లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్య సరికాదు : చైనా

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్‌ భూభాగంలోకి చొరబడి ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న భూతల దాడిపై చైనా మరోసారి ఘాటుగా స్పందించింది.

Update: 2024-10-02 13:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్‌ భూభాగంలోకి చొరబడి ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న భూతల దాడిపై చైనా మరోసారి ఘాటుగా స్పందించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై తాము తీవ్ర ఆందోళనతో ఉన్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

లెబనాన్ దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, భద్రతకు ఇజ్రాయెల్ విఘాతం కలిగించడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్నారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని ప్రపంచ దేశాలు తమవంతు ప్రయత్నం తప్పకుండా చేయాలని చైనా పిలుపునిచ్చింది. 


Similar News