Ceasefire: లెబనాన్, గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలి.. యూఎన్ఓ శరణార్థి చీఫ్ ఫిలిప్పో గ్రాండి

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై యూఎన్ఓ శరణార్థి చీఫ్ ఫిలిప్పో గ్రాండి ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-10-14 12:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై యూఎన్ఓ శరణార్థి చీఫ్ ఫిలిప్పో గ్రాండి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ వివాదాన్ని నివారించేందుకు లెబనాన్, గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని నొక్కి చెప్పారు. హింస, ద్వేషాలను నియంత్రించడానికి ఇదొక్కటే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. జెనీవాలో సోమవారం నిర్వహించిన యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యుజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) వార్షిక సమావేశం సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాల్పుల విరమణ మాత్రమే యుద్ధాన్ని అడ్డుకోగలదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వైమాణిక దాడుల నుంచి ఉపశమనం పొందాలని వేల మంది లెబనాన్ పౌరులు కోరుకుంటున్నట్టు తెలిపారు. పౌరులపై దాడులు చేస్తే ఆ పోరాటం అర్ధరహితంగా ఉంటుందని చెప్పారు. ఇజ్రాయెల్ దాడుల నుంచి పారిపోతున్న లెబనీస్ పౌరులు సిరియాకు చేరుకుంటున్నారని అంచనా వేశారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో గ్రాండీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Similar News