హెచ్-1 బీ వీసాదారులకు శుభవార్త చెప్పిన కెనడా.. అదేంటంటే..?
వివిధ వృత్తులు, బిజినెస్ పరంగా ఆయా దేశాల్లో భారతీయులు స్థిరపడ్డారు.
దిశ, వెబ్ డెస్క్ : వివిధ వృత్తులు, బిజినెస్ పరంగా ఆయా దేశాల్లో భారతీయులు స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆమెరికా, కెనడాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లో హైటెక్ రంగాల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. అమెరికాలో పనిచేసే వారు తరచూ హెచ్-1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాను కలిగి ఉంటారని తెలిపారు. జూలై 16, 2023 నాటికి అమెరికాలోని హెచ్-1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసా హోల్డర్లు, వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.
కాగా.. కొత్త నిర్ణయం ప్రకారం ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు మూడేళ్ల వరకు ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుందని తెలిపారు. వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పని చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. వారి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా వర్క్ లేదా స్టడీ పర్మిట్ తో తాత్కాలిక రెసిడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.