Indian Agents : నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కాలేదు : కెనడా

దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది జూన్ 18న కెనడాలో జరిగిన ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై అక్కడి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది.

Update: 2024-10-07 12:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది జూన్ 18న కెనడాలో జరిగిన ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై అక్కడి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. దానిపై రాయల్ కెనడియన్ పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించింది. పోలీసుల దర్యాప్తు నివేదిక కోసం తాము ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఈవిషయాన్ని కెనడా మంత్రి వెల్డన్ ఎప్.. ఒట్టావా నగరంలోని ఫారిన్ ఇంటర్‌ఫియరెన్స్ కమిషన్‌కు తెలియజేశారు.

‘‘ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే నిజానిజాలు తెలుస్తాయి. ఇంతకుముందు మేం నిఘా సంస్థల సమాచారం ఆధారంగానే భారత్‌పై ఆరోపణలు చేశాం. నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందనేది నిర్ధారిస్తూ ఇప్పటిదాకా ఎలాంటి తీర్పు కూడా రాలేదు’’ అని ఆయన చెప్పారు. గతేడాది సెప్టెంబరు 18న కెనడా పార్లమెంటు వేదికగా భారత్‌పై ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నోరు పారేసుకున్నాారు. నిజ్జర్ హత్య వెనుక భారత గూఢచార సంస్థ ‘రా‌’కు చెందిన ఏజెంట్లు ఉన్నారని ఆరోపించారు. అయితే ఆ అభియోగాలను భారత్ తీవ్రంగా ఖండించింది. 


Similar News