మ‌ళ్లీ పుట్టిన డైనోసార్‌లు..! ఈజిప్ట్‌లో క‌నుగొన్న శాస్త్ర‌వేత్త‌లు

డైనోసార్ జాతికి చెందిన వెన్నుపూస ఎముకను నిపుణులు కనుగొన్నారు. 'bulldog-faced' huge dinosaur with tiny arms found in Egypt.

Update: 2022-06-09 09:12 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః భూమిపైన మాన‌వుడి ఉద్భ‌వానికి ముందు డైనోసార్లే రాజ్యం ఏలేవ‌ని క‌థ‌లుగా విన్నాం. శాస్త్రీయ ఆధార‌ల‌తో డైనోసార్ల గురించి ఆస‌క్తిక‌ర అంశాలు ఎప్ప‌టిక‌ప్పుడు వెలుగులోకి వ‌స్తునే ఉన్నాయి. అయితే, తాజాగా, భూమిపై డైనోసార్ల ఉనికి ఇప్పుడు కూడా ఉంద‌న్న‌ట్లు క‌నిపించే ఆధారాలను ఆధునిక శాస్త్ర‌వేత్త‌లు తెలియ‌జేస్తున్నారు. ప్రపంచంలో, బుల్‌డాగ్-ముఖంలా క‌నిపించే జీవి రూపంలో డైనోసార్లు కొత్తగా భూమిపైకి ప్రవేశిస్తున్న‌ట్లు వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇలాంటి ఓ జీవి 98 మిలియన్ సంవత్సరాల క్రితం సహారా ఎడారిలో సంచరించేదని చెబుతున్నారు. ఈ వింతగా కనిపించే డైనోసార్‌కు చిన్న చేతులు ఉన్నాయని, స్కూల్‌ బస్సు అంత పెద్దదిగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇది ఈజిప్టులో కనుగొన్నామ‌ని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈజిప్టులోని పశ్చిమ ఎడారిలోని బహారియా ఒయాసిస్ వద్ద దీన్ని క‌నుగొన‌గా, కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఇంకా పేరు పెట్టని ఈ డైనోసార్ జాతికి చెందిన వెన్నుపూస ఎముకను నిపుణులు కనుగొన్నారు.

మాంసం తినే ఈ జీవికి రెండు కాళ్లు, చిన్న దంతాలు, పొట్టి చేతులు ఉన్నట్లుగా పరిశోధకులు తెలిపారు. ల‌భ్య‌మైన జీవి అవ‌శేషాల‌ను బట్టి దాని పొడవు 20 అడుగుల (ఆరు మీటర్లు) ఉన్నట్లు చెబుతున్నారు. ఇక‌, ఈ మృగం బల్లి లాంటి అబెలిసౌరిడ్ డైనోసార్ కుటుంబానికి చెందినదని, ఇది క్రెటేషియస్ కాలంలో (145 నుండి 66 మిలియన్ సంవత్సరాల క్రితం) వృద్ధి చెందిందని అంటున్నారు. ఇది డైనోసార్ల యుగంలోని చివరి కాలంలో ఉన్న‌ట్లు గుర్తిచారు. ప్రధానంగా పటగోనియా, గోండ్వానాలోని ఇతర ప్రాంతాలలో ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. గోండ్వానా ఒక పురాతన దక్షిణ సూపర్ ఖండం. ఇది ప్రస్తుతం దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆఫ్రికా, భారత ఉపఖండం, అరేబియా ద్వీపకల్పంగా గుర్తింపు పొందింది.

ఇక‌, ఈ జీవులు అబెలిసౌరిడ్‌లు T-రెక్స్ లాగా కనిపించేవి. రెండు చిన్న చేతులతో, పొట్టిగా, లోతైన పుర్రెలతో ఉంటాయి. డైనోసార్ల‌లాగా అబెలిసౌరిడ్స్‌కు కూడా భారీ దవడలు ఉన్నాయి. ఈజిప్టులో ఉన్న‌ మన్సౌరా యూనివర్శిటీ వెర్టిబ్రేట్ పాలియోంటాలజీ సెంటర్ (ఎంయువిపి)కి చెందిన బెలాల్ సేలం ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇత‌డు సేలం ఒహియో విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి, అలాగే, బెన్హా విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్నారు. మెడ బేస్ నుండి వెన్నుపూస ఎముక ఆధారంగా ఈ ఆవిష్కరణ జరిగిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఇది 2016లో బహారియా ఒయాసిస్‌కు చేసిన యాత్రలో కనుగొన‌గా ఇటీవ‌ల ది రాయ‌ల్ సొసైటీలో ప‌రిశోధ‌న‌ను ప్ర‌చురించారు. ఒహియో విశ్వవిద్యాలయం రిపోర్టును ప్ర‌క‌టించ‌గా, సైన్స్‌డైలీ వార్తా క‌థ‌నం ప్ర‌చురించింది. 


Similar News