Bill Gates : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బిల్‌గేట్స్.. ఇండియా ‘గ్లోబల్ లీడర్’ అని కీలక వ్యాఖ్యలు
అమెరికాలోని సియాటెల్ భారత కాన్సులేట్‌లో మొట్టమొదటి సారిగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ప్రపంచ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలోని సియాటెల్ భారత కాన్సులేట్‌లో మొట్టమొదటి సారిగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ప్రపంచ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సియాటెల్ నగరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తాతో కలిసి గ్రేటర్ సియాటెల్ ప్రాంతంలో వేడకలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్ పురోగతి చెందుతోందని చెప్పుకొచ్చారు. సురక్షితమైన, తక్కువ ధర వ్యాక్సిన్‌ల ఉత్పత్తి చేయడం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మిస్తున్నారని ప్రశంసించారు. ఈ వేడుకల్లో వాషింగ్టన్ లెఫ్టినెంట్ గవర్నర్ డెన్నీహెక్, వాషింగ్టన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీవ్ హాబ్స్‌లతో పాటు కాంగ్రెస్ మహిళా సభ్యులు సుజాన్ కె డెల్‌బెన్, కిమ్ ష్రియర్, ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, భారత్ సియాటెల్ తాజాగా ఈ వేడుకల ఫోటోలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో పోస్ట్ వైరల్‌గా మారింది.