ప్ర‌పంచంలో అతిపెద్ద‌ మొక్కను గుర్తించిన సైంటిస్ట్‌లు.. ఎంతో తెలుసా?!

దీనితో ఈ మొక్క‌ వ‌య‌సు ఎంతో అర్థ‌మ‌య్యిందిగా?! ‘Biggest plant on Earth’ found in Shark Bay off Australia’s west coast.

Update: 2022-06-01 11:32 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః భూమి పైన ఎన్నో వింత‌లున్నాయ‌ని అంద‌రికీ తెలుసు. అయితే, అన్నింటి గురించి మ‌నిషికి తెలియ‌వు. వాటిని గుర్తించిన‌ప్పుడు అందులో ఉన్న అద్భుతాన్ని మ‌నిషి ఆశ్వాదిస్తాడు. అలాగే, ఇటీవ‌ల భూమిపై ఉన్న అతిపెద్ద మొక్కను ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోని షార్క్ బేలో ప‌రిశోధ‌కులు క‌నుక్కున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివ‌రాల ప్రకారం ఇది దాదాపు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే దాదాపు 49 వేల ఎక‌రాల విస్తీర్ణం అన‌మాట‌! ఈ మొక్క పోసిడోనియా ఆస్ట్రేలిస్ జాతికి చెందినది. దీనిని ఫైబర్-బాల్ కలుపు లేదా రిబ్బన్ కలుపు అని కూడా అంటారు. ఇది సాధారణంగా ఆస్ట్రేలియా దక్షిణ తీరప్రాంతాల్లో కనిపిస్తుంది. తీరం అంతటా రిబ్బన్ కలుపులో ఉండే జన్యుపరమైన తేడాల కోసం వెతుకుతున్న క్ర‌మంలో శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ గురించి, కొంత పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. '180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైట్‌ల నుండి తీసిన నమూనాలను వేర్వేరని అనుకున్నాము. కానీ, అవ‌న్నీ క‌లిపి ఒకే మొక్క అని, పోసిడోనియా ఆస్ట్రేలిస్ బహుళ నమూనాలు కాదని త‌ర్వాత తెలుసుకున్నాము' అన్నారు ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయంలోని పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ మార్టిన్ బ్రీడ్. ఈ ప‌రిశోధ‌నను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ B లో ప్రచురించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రిబ్బన్ కలుపు రైజోమ్‌లు సంవత్సరానికి 35 సెం.మీ. వరకు పెరుగుతుంది. అంటే, ప్ర‌స్తుత‌మున్న విస్తీర్ణాన్ని బ‌ట్టి ఈ మొక్క ఇంత వ్యాప్తి చెందడానికి కనీసం 4,500 సంవత్సరాలు పట్టిందని తెలుస్తోంది. దీనితో ఈ మొక్క‌ వ‌య‌సు ఎంతో అర్థ‌మ‌య్యిందిగా?!


Similar News